ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం 72వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. వేడుకలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశిష్ట సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అయితే, రాజ్యాంగ దినోత్సవాన్ని యావత్ ప్రతిపక్షం బహిష్కరించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి,ప్రధాని,లోకసభ స్పీకర్,ఉభయ సభల సభ్యులు పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమానికి అన్ని ప్రతిపక్షాలు దూరంగా ఉండటం సర్వత్రా చర్చకి దారి తీసింది. దీంతో ప్రధాని మోడీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. వంశ పాలన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రతిపక్షాల వైఖరిని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు రాజ్యాంగ దినోత్సవ సభను బహిష్కరించడాన్ని ఆయన తప్పు పట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..