బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడ్వకేట్ సోమ భరత్ రెండో రోజు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. వరుసగా రెండో రోజు ఈడీ ముందు సోమ భరత్ హాజరయ్యారు. భరత్ సమక్షంలో కవిత ఫోన్ డేటాను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన విచారణలో 9 ఫోన్లను కవిత ఈడీ అధికారులకు కవర్ లో అప్పగించారు. ఈ క్రమంలో ఆ ఫోన్లను తెరిచేందుకు సాక్షిగా కవితను కానీ ఆమె ప్రతినిధిని కానీ రావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు కోరారు. అయితే కవిత తరపున అడ్వకేట్ సోమ ఇవాళ రెండో రోజు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement