పెరుతుగున్న యాత్రీకరణ వల్ల వచ్చే ఏడాది నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గల్లంతు అవక తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికిపైగా పనిచేస్తుండగా 2022 నాటికి తక్కువ నైపుణ్యాలు కలిగిన 30 లక్షల మందిని తగ్గించుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఏడాదికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది. ఉద్యోగాల్లో కోతకు యాంత్రీకరణే కారణమని వివరించింది. రోబో ప్రాసెస్ ఆటోమేషన్ ప్రభావంతో అమెరికాలో 10 లక్షలు, భారత్‌లో ఏడు లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రభావం ఉందని పేర్కొంది. ఇక ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్న సంస్థల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement