సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంతో 50మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటు చేసుకుంది. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలియగానే.. సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ యాజమాన్యం అప్రమత్తమైంది. 50 మంది విద్యార్థులను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం కరీంనగర్ ఏరియా ఆసుపత్రిలో యాభై మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో పలువురి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు… ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు … దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ వెల్ఫేర్ గర్స్ల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ..50మంది విద్యార్థులకి అస్వస్థత .. పలువురి పరిస్థితి విషమం ..
Advertisement
తాజా వార్తలు
Advertisement