జమ్ముకశ్మీర్ లో ఎక్కడపడితే అక్కడ మంచు పేరుకుపోతోంది. తాజాగా శ్రీనగర్-లేహ్ రహదారి కొన్ని కిలోమీటర్ల మేర మంచులో కూరుకుపోయింది. విపరీతంగా కురియడంతో ఆ రోడ్డుపై మంచు పెద్దఎత్తున పేరుకుపోయింది. దాంతో ఆ రోడ్డు వెంబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డును క్లియర్ చేసేందుకు స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు.బుల్ డోజర్‌ల సాయంతో రహదారిపై మంచును క్లియర్ చేస్తున్నారు. బీకన్ ఆఫ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కింద కొనసాగుతున్న ఈ స్నో క్లియరెన్స్ పనుల్లో పురోగతి కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి, మళ్లీ మంచు కురియకపోతే ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది.కాగా ఈ వీడియో వైరల్ గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement