ఇంట్లోకి పాములు వస్తే ఇంటిని తగలబెడతామా..వాటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తాం.. కానీ ఓ వ్యక్తి ఇంట్లోని పాములను పారద్రోలేందుకు ఏకంగా ఇంటినే తగులబెట్టిన సంఘటన అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ ఇంటి విలువ రూ.13.55కోట్లు. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఆ ఇంటిలో పాముల బెడద ఉన్నది. తరుచూ ఆ ఇంటికి పాములు రావడం ఆ ఇంటి యజమానికి చిరాకు తెప్పించింది. ఎలాగైనా వీటిని వెళ్లగొట్టాలని అనుకున్నాడు. ఇంట్లో ఉష్ణోగ్రతలు పెంచి అంటే వేడిమి పుట్టించి పొగ ద్వారా పాములను వెళ్లగొట్టాలని బొగ్గును తెచ్చుకున్నాడు. కాగా ఆ బొగ్గును పేలిపోయే ప్రమాదం ఉన్న వస్తువుల దగ్గర ఉంచి పెద్ద తప్పు చేశాడు. బొగ్గుకు నిప్పు అంటించిన తర్వాత దానికి సమీపంలోని పేలిపోయే ముప్పు ఉండే వస్తువులు బ్లాస్ట్ అయ్యాయి.
బొగ్గు ద్వారా ఏర్పడ్డ నిప్పు ఆయన నియంత్రణలో ఉన్నప్పటికీ ఈ వస్తువుల పేలుడు ఒక్కసారిగా పరిస్థితులను తారుమారు చేశాయి. ఆ తర్వాత ఆ ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ముందు ఆ మంటలు బేస్‌మెంట్‌లో ఎక్కువయ్యాయి. ఆ తర్వాత వేగంగా ఇతర ఫ్లోర్‌లలోకీ వ్యాపించాయి. చివరికి వాటిని ఆర్పలేని పరిస్థితులకు చేరిపోయాయి. ఆ మంటలను చూస్తి యజమాని నిస్సహాయుడుగా మిగిలిపోయాడు. అదృష్టవశాత్తు ఆ ఇంటిలో మరెవరూ మంటల్లో చిక్కుకోలేదు. దాంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఈ ఇంటి నష్టం సుమారు రూ 7.52 కోట్ల వరకు ఉంటుందని ఓ మీడియా సంస్థ తెలిపింది. ఇటీవలే ఆ ఇంటిని రూ. 1.355 కోట్లు వెచ్చించి కొనుగోలు జరిపారట. ఇల్లు కాలిపోతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..