Tuesday, November 19, 2024

విమానంలో పాము.. ప్ర‌యాణికులు సుర‌క్షితం

విమానంలో పాము క‌ల‌క‌లంరేపింది. దుబాయ్ వెళ్తోన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కార్గో హోల్డ్‌లో పాము కనిపించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఎక్స్ బీ)లో విమానం ల్యాండ్ అయిన వెంటనే పాము ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. అనంతరం వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీజీఏ) విచారణకు ఆదేశించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుండి బయలుదేరింది, అయితే అది డీఎక్స్‌బీ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత కార్గో హోల్డ్‌లో పాము కనిపించిందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే దుబాయ్ ఎయిర్‌పోర్టులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. ప్రయాణికులందరినీ దుబాయ్ ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్లారు. ఓ ప్రయాణికుడు తాము దుబాయి విమానాశ్రయంలో 7 గంటలు చిక్కుకుపోయామని తెలుపుతూ సోషల్ మీడియాలో తన దుస్థితిని పోస్ట్ చేశాడు. దీనికి ఎయిర్ ఇండియా బదులిచ్చింది. డియర్ సర్, మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మిమ్మల్ని హోటల్‌కి బదిలీ చేశారని మా టీం తెలియజేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ధన్యవాదాలు అని ఎయిర్ ఇండియా బదులిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement