Tuesday, November 26, 2024

చేనేత చీర‌లో మెరిసిన ఐఏఎస్ అధికారిణి స్మిత స‌భ‌ర్వాల్-తెలంగాణ చేనేత‌కు స‌రికొత్త ఇమేజ్

తెలంగాణ చేనేత‌కు స‌రికొత్త ఇమేజ్ తీసుకురావాల‌న్న త‌ప‌న‌తో ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాలన్న భావన కలిగేలా చేస్తోంది. ఇటీవల ఆమె ఒక చేనేత చీరను ధరించి.. సోషల్ మీడియాలో ఫొటోని పోస్టు చేశారు. చేనేతను ప్రమోట్ చేసేలా ఉన్న ఆ ఫోటోకు నెటిజన్లు పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించారు. ఫోటోను పోస్టు చేయటంతో ఆగకుండా.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు మరికొందరు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులకు చేనేత వస్త్రాల్ని ధరించాలని సవాలు విసిరారు.

ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన వారు తమకు నచ్చిన చేనేత వస్త్రాల్ని ధరించి సోషల్ మీడియాలో సందడి చేశారు. దీంతో.. ఇప్పుడు చేనేత వస్త్రాల మీద మరోసారి చర్చ మొదలైంది. స్మిత సభర్వాల్ మొదలు పెట్టిన ఈ సవాల్ కు స్పందించిన మరికొందరు మహిళా ఐఏఎస్ అధికారిణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వారికి ఐపీఎస్ లు తోడయ్యారు. కలెక్టర్లుగా వ్యవహరిస్తున్న హరిచందన.. శిక్తా పట్నాయక్.. ప్రమీలా సత్పతి.. శిఖాగోయల్.. స్వాతిలక్రా.. తదితరులు తమకు నచ్చిన చేనేత చీరలను ధరించి ప్రతి ఛాలెంజ్ విసురుతున్నారు. దీంతో.. తెలంగాణ చేనేతకు సరికొత్త ఇమేజ్ పెరగటమే కాదు.. డిమాండ్ పెరిగాయ‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement