పాలసీ అడ్వకసీ వేదిక అయిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఐపీఎఫ్ స్మార్ట్ పోలీసింగ్ సర్వే 2021ని చేపట్టింది. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. కాగా తెలంగాణ రెండోస్థానంలో ఉంది. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ ఈ స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌ను సర్వే ఆధారంగా రూపొందించారు. మొత్తం పది పాయింట్లతో ఈ లిస్ట్ తయారు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 8.11 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, 8.10 పాయింట్లతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రిపోర్టును ప్రచురించాయి. ఈ సర్వేలో ఐఐటీ కాన్పూర్, ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)కు చెందిన నిపుణుల పాలుపంచుకున్నారు. స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల నుంచే రూపుదాల్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత .. అసోం (7.89), కేరళ (7.53), సిక్కిం (7.18), మిజోరం (7.14), గుజరాత్ (7.04), ఒడిశా (6.94), హిమాచల్ ప్రదేశ్ (6.91), పుదుచ్చేరి (6.91), గోవా (6.86), ఢిల్లీ (6.85), తమిళ నాడు (6.73), కర్ణాటక (6.69), ఉత్తరాఖండ్ (6.69), పశ్చిమ బెంగాల్ (6.66), మేఘాలయ (6.60), హర్యానా (6.39), త్రిపుర (6.33), జమ్ము కశ్మీర్ (6.26), మహారాష్ట్ర (6.25)లు వరుసగా ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఉత్తర ప్రదేశ్ 5.81 పాయింట్లతో 28వ స్థానంలో ఉండగా, బిహార్ 5.74 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..