Saturday, September 7, 2024

Smart Gadget – స్మార్ట్ గా ఉంగ‌ర‌మూ ! న‌యా గ్యాడ్జెట్స్‌

స్మార్ట్‌ఫోన్‌, వాచ్ త‌ర‌హాలో ఫీచ‌ర్లు
శామ్‌సంగ్‌, బోట్ కంపెనీల రింగులు
వాకింగ్‌, హార్ట్ రేట్‌, ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ట్రాక్‌
మార్కెట్‌ని ముంచెత్త‌నున్న ఫింగ‌ర్ రింగ్స్‌
ముచ్చ‌ట‌ప‌డి కొంటున్న‌ వినియోగ‌దారులు

ఇప్ప‌టిదాకా స్మార్ట్‌ఫోన్‌లు.. ఆ తర్వాత స్మార్ట్‌ వాచ్‌ల హ‌వా న‌డుస్తోంది. ఇక‌.. ఇప్పుడు స్మార్ట్‌ రింగ్‌లు కూడా మార్కెట్‌లోకి వ‌చ్చేశాయి. ప్రస్తుతం స్మార్ట్ స్మార్ట్‌గా అంద‌రి చేతుల‌కు స్మార్ట్‌ రింగ్స్ క‌నిపిస్తున్నాయి. రోజుకో కంపెనీ మార్కెట్లోకి స్మార్ట్‌ రింగ్స్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే శామ్‌సంగ్ వంటి దిగ్గజ సంస్థలు స్మార్ట్‌ రింగ్స్‌ను లాంచ్‌ చేయగా.. తాజాగా భారత్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం బోట్‌ సైతం స్మార్ట్‌ రింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో బోట్‌ ఈ స్మార్ట్‌ రింగ్‌ను లాంచ్ చేయ‌డంతో గ్యాడ్జెట్ ప్రియులు ఆస‌క్తిగా ఉన్నారు.

- Advertisement -

స్మార్ట్ వాచ్‌ ఫీచ‌ర్లన్నీ ఇందులోనే..

స్మార్ట్ రింగ్ యాక్టివ్‌ పేరుతో బోట్ ఈ రింగ్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో లాంచ్‌ చేశారు. రింగ్ ఫీచర్ల విషయానికొస్తే.. స్మార్ట్‌ వాచ్‌లు చేసే పనులన్నీ ఈ రింగ్ చేస్తుంది. వేలుకి ధరిస్తే చాలు.. మీ హార్ట్‌ బీట్‌ రేటుతో పాటు ఆక్సిజన్‌ స్థాయిలను ట్రాక్‌ చేస్తుంది. స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను ఫోన్‌లో చూసుకోవచ్చు. ఇక.. స్మార్ట్ రింగ్ రోజువారీ కార్యకలాపాలను ట్రాక్‌ చేస్తుంది. ఈ రింగ్‌ 20కిపైగా ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా రోజు ఎన్ని అడుగులు నడిచారన్న విషయాన్ని కూడా లెక్కిస్తుంది.

స్పెషిఫికేష‌న్స్ ఇవే..

ఇక.. ఈ రింగ్‌ బరువు 4.7 గ్రాములుగా ఉంటుంది. బోట్‌ కంపెనీ స్మార్ట్‌ రింగ్‌పై ఏడాది వారంటీని అందిస్తుంది. జులై 20 నుంచి అమ్మకాలు ప్రారంభమైన ఈ రింగ్‌ అమెజాన్‌తో పాటు, బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. రింగ్‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేశారు. ఆరు ర‌కాల సైజ్‌లతో పాటు, 3 కలర్స్‌లో తీసుకొచ్చారు. బ్లాక్‌, గోల్డ్‌, సిల్వర్‌ కలర్స్‌లో లాంచ్‌ చేశారు. స్మార్ట్‌ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఫోన్‌ కెమెరాను కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement