Friday, November 22, 2024

Small Screen: సీరియళ్లలో హ‌గ్గింగ్‌, కిస్సింగ్‌ సీన్లు బంద్..

మితిమీరుతున్న శృంగార సీన్లపై బ్యాన్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. టీవీ సీరియళ్లలో ఇక మీద‌ట హ‌గ్గింగ్స్‌, కిస్సింగ్స్ ఉండొద్ద‌ని ఆర్డ‌ర్ వేసింది. ఇక నుంచి సీరియళ్లలో కౌగిలింతలు, ముద్దులు, పడకసీన్లు ఉండకూడదని ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) టీవీ చానళ్లను ఆదేశించింది.

ఇలాంటి కంటెంట్ ఇటీవల మితిమీరడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్థాన్ ప్ర‌భుత్వం తెలిపింది. అంతేకాదు, ఆ కార్యక్రమాలు త‌మ సమాజపు అసలైన సంస్కృతిని ప్రతిబింబించడం లేదని కూడా పేర్కొంది.

సీరియళ్లలో వివాహేతర సంబంధాలు, అసభ్యకరమైన దృశ్యాలు, కౌగిలింతలు, పడక సన్నివేశాలు, జంటల మధ్య సాన్నిహిత్యం లాంటివి ఇస్లామిక్ బోధనలు, దేశ సంస్కృతిని విస్మరిస్తున్నాయని పీఈఎంఆర్ఏ తెలిపింది.

టీవీ చానళ్లు తమ సీరియళ్ల కంటెంట్‌ను ముందుగా అంతర్గత కమిటీ పర్యవేక్షణ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్షించాలని, అలాంటి దృశ్యాలుంటే క‌ట్ చేయాల‌ని తెలిపింది. ఆ తర్వాతే వాటిని ప్రసారం చేయాలని ఆదేశించింది.

అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. మహిళలపై వేధింపులు, పరువు హత్యలను పట్టించుకోని ప్రభుత్వం, ఎవరో ఫిర్యాదు చేశారని చెప్పి ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం తగదని అంటున్నారు చాలామంది వీక్ష‌కులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement