Thursday, November 14, 2024

Rain Alert: స్మాల్ బ్రేక్‌.. మ‌ళ్లీ వ‌స్తా, ఇక ద‌బిడ‌దిబిడే అంటున్న వ‌రుణుడు!

తెలంగాణ‌లో దాదాపు వారం, ప‌ది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రేగులగూడెం (జయశంకర్‌ జిల్లా), చెన్నూరు (మంచిర్యాల)లలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం వరకు కొద్ది గంటల్లోనే 10 సెం.మీ.లకు పైగా కురిసిన కుండపోత వ‌ర్షం తీవ్రత గురువారం క‌నిపించ‌లేదు. అయితే.. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని.. కానీ, ఈ నెల 18వ తేదీ త‌ర్వాత‌ మళ్లీ భారీ వర్ష సూచనలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement