హసన్ పర్తి, (ప్రభన్యూస్): తాటిచెట్టు ఎక్కుతున్న గీత కార్మికుడు ఆకస్మాత్తుగా చెట్టుపైనుంచి పట్టుతప్పి జారిపోయాడు.. ఇది గమనించిన ఆ పక్కన ఉన్న మరో గీత కార్మికుడు వెంటనే చెట్టుపైకి వెనకాలే ఎక్కి.. అతడిని కాపాడాడు. ఈ ఘటన ఇవ్వాల ఉదయం వరంగల్ జిల్లాలో జరిగింది. కులవృత్తిలో అతికష్టమైన వృత్తి గీతవృత్తి .. వృత్తిలోభాగంగా తాటిచెట్టు ఎక్కుతూ ప్రమాదాల బారిన పడి అనేక మంది గీత కార్మికులు కాళ్ళు చేతులు విరగడం.. చనిపోవడం, వెన్నెముక పోగొట్టుకోవడం లాంటివి అనేకం జరుగున్నాయి.
కాగా, ఇవ్వాల వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లిలో ఓ గీతకార్మికుడిని తోటి వ్యక్తి ప్రాణాలతో కాపాడాడు. గ్రామంలో పాటి అనిల్ గౌడ్ చనిపోయి మూడు రోజులు గడవకముందే అదే గ్రామానికి చెందిన బండి పాణి గౌడ్ తాటిచెట్టు ఎక్కుతుండగా జారీ పడుతుంటే.. పక్కనే ఉన్న మరో గౌడ్ గమనించి క్షేమంగా కిందకి దింపాడని మడిపల్లి గౌడ సంఘం నేతలు తెలిపారు.