స్విమ్మింగ్ ఫూల్ లో సొమ్మ సిల్లిపడిపోయింది స్విమ్మర్ అనితా అల్వరేజ్. నీటి మధ్యలో తేలుతున్న ఆమెను కోచ్ రక్షించారు. ఈ ఘటన బుదాపెస్ట్లో జరుగుతున్న వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో జరిగింది. 25 ఏళ్ల స్విమ్మర్ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోలేకపోయింది. సోలో ఫ్రీ ఈవెంట్లో తన రొటీన్ పూర్తి చేసిన తర్వాత ఆ స్విమ్మర్ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. కోచ్ ఆండ్రియా పూల్లోకి దూకి.. స్విమ్మర్ అల్వరేజ్ను రక్షించాడు. అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఓ ప్రకటన రిలీజ్ చేసింది. గత ఏడాది బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లోనూ స్విమ్మర్ అల్వరేజ్ పూల్లో సొమ్మసిల్లిపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement