Tuesday, November 19, 2024

Gold Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్​లో ఇవ్వాల్టి ధర ఎంతంటే..

బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. గత వారం చివర్లో తగ్గిన బంగారం ధరలు ఇవ్వాల మళ్లీ స్వల్పంగా పెరిగాయి. వెండి ధర నిలకడగా ఉంది. రూ.660 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760కి పుంజుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,360 వద్ద విక్రయాలు జరుగుతోంది. ఇవ్వాల హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయ్యింది.

ఏపీలో బంగారం ధర..
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,760 అయ్యింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,360. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

విశాఖపట్నం, తిరుపతిలో రూ.660 మేర ఎగబాకడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,760 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,360 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement