యూరప్ ఖండంలోని మాంటెనెగ్రో దేశంలో నిక్సిక్ అనే నగరంలో నిద్ర పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ పోటీల్లో ఎవరు ఎక్కువ సేపు మంచంపై పడుకుండిపోతే వారికి బహుమతి ఇస్తారు. నిక్సిక్ లో దాదాపు 12 ఏళ్లుగా ఈ లైయింగ్ డౌన్ పోటీ జరుగుతోంది. ఈ ఏడాది కూడా వంద ఏళ్ల వయసున్న ఓ పెద్ద చెట్టు కింద మంచాలు వేసి పోటీ నిర్వహించారు. ఈ పోటీలో జర్కో పెజనోవిక్ అనే యువకుడు 60 గంటల పాటు మంచంపైనే ఉండి బహుమతి గెలుచుకున్నాడు. అతడికి బహుమతి కింద రూ.27 వేలతోపాటు తనతోపాటు మరొకరికి రెస్టారెంట్ లో భోజనం, ఒక వీకెండ్ స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఏ పని చేయకుండా మంచంపై వాలి డబ్బులు సంపాదించడం సులువు అనిపిస్తుందిగానీ.. అది చాలా కష్టమని పోటీలో గెలుపొందిన జర్కో పెజనోవిక్ చెప్పారు. తన వద్దకు కుటుంబ సభ్యులుగానీ, స్నేహితులుగానీ ఎవరైనా వచ్చినప్పుడు లేవకుండా ఉండటం కష్టమేనని వివరించాడు.మొత్తం తొమ్మిది మంది పోటీ పడినా.. అందులో ఏడుగురు తొలిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండు రోజులు మిగతా ఇద్దరే పోటీ పడ్డారు. చివరికి జర్కో గెలిచాడు.
పోటీలో ఆరు బయటే చెట్టు కింద మంచాలపై పడుకోవాల్సి ఉంటుంది. అయితే వర్షం వచ్చినప్పుడు మాత్రం పక్కనే ఉన్న గుడిసెలోకి తరలిస్తారు.
గత 12ఏళ్లుగా నిద్ర పోటీలు- గెలిచిన జర్కో పెజనోవిక్-రూ.27వేలు బహుమతి
Advertisement
తాజా వార్తలు
Advertisement