సాధారణంగా నిద్రలో కలలు రావడం సహజమే.. కానీ ప్రతి కలకి ఓ అర్థం ఉందండోయ్..మరి ఆ వివరాలు చూద్దామా .. ఒక్కోసారి కలలో పాములు , కుక్కలు, నీళ్ళు ఇలా పలు రకాలుగా వస్తుంటాయి. అయితే మనకి పరిచయం ఉన్న వ్యక్తులు అందులోనూ మన కుటుంబానికి చెందిన వారే వస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వివాహితకి ఆమె భర్త కలలో కనిపిస్తే ఆమె సుమంగళిగా ఉంటుందట. మరి భర్తకి భార్య కలలోకి వస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందట. అంతేకాదు జాబ్ లో ప్రమోషన్ కూడా వస్తాయట. అత్తగారు కలలో కన్పిస్తే ధన లాభం కలుగుతుంది. కలలో అన్నా వదినలు కన్పిస్తే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. తమ్ముడు కలలో కన్పిస్తే గొప్పవారితో పరిచయాలు కలుగుతాయి. కలలో అన్నదమ్ములు కనిపిస్తే గౌరవం కలుగుతుంది. ఇక తల్లిదండ్రులు కలలోకి వస్తే ఏదైనా శుభకార్యాలు జరుగుతాయట.
Advertisement
తాజా వార్తలు
Advertisement