దేశ వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ వరకు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసింది. రేపు ఆరో దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 నియోజకవర్గాలకు జరగనున్నాయి. బీహార్ 8 సీట్లు, హర్యానా 10 సీట్లు, జమ్మూ కశ్మీర్ 1, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశా 6 , ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ 8 సీట్లకుగానూ.. మొత్తం 889 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి
లాజిస్టికల్, కమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీకి సంబంధించి అడ్డంకుల కారణంగా గత నెలలో ఎన్నికల సంఘం జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి పోలింగ్ తేదీని మే 7 నుంచి మే 25 మార్చింది. ఇక రేపు జరగనున్న ఆరో దశ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మే 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు
ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం) – చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ
హర్యానా – అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్
ఉత్తర ప్రదేశ్ – సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి, డోమ్రియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్, అజంగఢ్, జౌన్‌పూర్, మచ్లిషహర్, భదోహి
పశ్చిమ బెంగాల్ – తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్
జార్ఖండ్ – గిరిడి, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్
బీహార్ – వాల్మీకి నగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వి చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్ , శివన్, మహారాజ్‌గంజ్
జమ్మూ కశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) – అనంతనాగ్-రాజౌరి
ఒడిశా – భువనేశ్వర్, పూరి, ధెంకనల్, కియోంజర్ , కటక్, సంబల్పూర్