తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జీలు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈమేరకు అందిన సిఫార్సులను ఆమోదించింది. ఇవ్వాల (సోమవారం) భేటీ అయిన కోలీజియం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరో ఆరుగురు న్యాయవాదులను జడ్జీలుగా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే న్యాయవాదులుగా పనిచేస్తున్న సీనియర్లు ఇందులో ఉన్నారు.
1) ఏనుగుల వెంకట వేణుగోపాల్,
2) నగేశ్ భీమపాక
3) పుల్లా కార్తీక్
4) కాజా శరత్
5) జగ్గన్నగారి శ్రీనివాసరావు
6) నామవరపు రాజేశ్వరరావు పేర్లను సుప్రీకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.