తెలంగాణ భవన్లో టీర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును మారుస్తూ ఆరుగురు ఎమ్మెల్యేలు.. అంటే సామాజిక వర్గాల వారీగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎమ్మెల్యలతో పాటు మరో మహిళ ఎమ్మెల్యే కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఎందుకు మార్చాల్సి వస్తోంది. పార్టి విస్తరణకు సంబంధించిన వివరాలను చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పలు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్లో విలీన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కుమారస్వామి కూడా మాట్లాడనున్నారు.
ఇక.. తెలంగాణ భవన్ ఎదట పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది. కార్యకర్తలు, అభిమానులు జెండాలతో సందడి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ 1.19 నిమిషాలకు పార్టీ ప్రకటన చేయగానే పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు చేసేందుకు రెడీగా ఉన్నారు.