స్థలం ఎక్కువగా ఉంటే భారీగా ఇంటి నిర్మాణాన్ని చేపటవచ్చు. మరి స్థలం తక్కువ ఉంటే నిర్మాణం చేపట్టగలమా అనేవారికి స్ఫూర్తినిచ్చారు ఈ దంపతులు. కేవలం ఆరు అడుగుల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు మీకోసం.. ఆరు అడుగుల్లో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిచాడు ఓ వ్యక్తి. బీహార్ లోని ముజఫర్ పుర్ లో ఈ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ ఐఫిల్ టవర్ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆరు అడుగులు ఇన్ టు 45అడుగుల భూమిలో ఈ ఇంటిని నిర్మించారు. ఈ భవనాన్ని సంతోష్ , అర్చన దంపతులు నిర్మించారు. అంతేకాదండోయ్ ఓ అంతస్తుని అద్దెకి కూడా ఇచ్చారు ఈ దంపతులు. ఈ ఐఫిల్ టవర్ ఇంటిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఇంటి ముందు నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు ప్రజలు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..