Saturday, November 23, 2024

అసోంను వెంటాడుతున్న భూకంపాలు

ఈశాన్య రాష్ట్రం అసోం వరుస భూకంపాలతో వణికిపోతోంది. అసోం సోనిత్​పుర్​లో మరో ఆరు సార్లు భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున రిక్టర్​ స్కేలుపై 2.7 తీవ్రతతో సోనిత్​ పుర్ ​లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్‌ పూర్‌ లో ఆరుసార్లు భూకంపాలు నమోదయ్యాయి. మొదట అర్ధరాత్రి 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్‌ పూర్‌ కు 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.  రాత్రి 12 గంటల నుంచి.. 2.6, 2.9, 4.6, 2.7, 2.3 తీవ్రతలతో భూకంపం వచ్చినట్లు పేర్కొంది.

బుధవారం 6.4 తీవ్రతతో భారీగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. వరుసగా భూకంపాలు రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. రెండు రోజులుగా వస్తున్న భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం ఉదయం సంభవించిన భూకంపాలకు పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement