కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. రీసెంట్ గా సీనియర్ నటుడు సత్యనారాయణ కరోనా బారిన పడ్డారు..ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడగా..తాజాగా డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడు,భార్య కి కూడా కరోనా సోకింది. కాగా ఆయన చిన్న కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్‌కు మాత్రమే కరోనా సోకలేదని తెలిసింది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ (ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలాజీ)లో శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకినట్టు సమాచారం. పెద్ద కుమారుడు, భార్య హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అజయ్ కృష్ణ వీరి బాగోగులు చూసుకుంటున్నారు.
శివ శంకర్ మాస్టర్ చికిత్సకు రోజుకు లక్ష రూపాయల వరకూ ఖర్చు అవుతోందని, కుమారుడి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో పరిశ్రమ నుంచి లేదా ప్రజలు ఎవరైనా ఆర్ధిక సహాయం చేస్తారేమోనని…. దాతల కోసం ఎదురు చూస్తున్నారు.శివ శంకర్ మాస్టర్ తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ‘మగధీర’ సినిమాలో ‘ధీర ధీర…’ పాటకు గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. ఆయన నటుడిగానూ కొన్ని సినిమాలు చేశారు. టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు. ఎన్నో గొప్ప పాటలకు కొరియోగ్రఫీ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాన్స్ మాస్టర్ కు ఇటువంటి పరిస్థితి రావడం బాధాకరమని ఆయన అభిమానులు అంటున్నారు. శివ శంకర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.