శ్రీరామ నవమిని పురష్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా నేటి రాత్రికి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.ఈ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. సాయంత్రం ఒంటిమిట్ట చేరుకుని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణాన్ని తిలకిస్తారు. అనంతరం కడప వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న ఉదయం శ్రీరాముడు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చాడు. ఒంటిమిట్ట వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాములోరి కల్యాణ ఏర్పాట్లను టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి పరిశీలించారు. వసతుల కల్పన, అన్నప్రసాదం, ముత్యాల తలంబ్రాల పంపిణీకి సంబంధించి కలెక్టర్ విజయరామరావు, ఎస్పీ అన్బురాజన్, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్ వర్మ, ఇతర సీనియర్ అధికారులతో చర్చించారు.
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం – పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement