శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగింది. కొవిడ్ నేపథ్యంలో భక్తులు లేకుండానే ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది మంది అథితులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రేపు శ్రీసీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకం జరగనుంది.
కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకుల్లో కొందరు రాముడి తరపున, మరికొందరు సీతమ్మ తరపున ప్రతినిధులుగా వ్యవహరించి ఉత్సవాన్ని నిర్వహించారు.