న్యూమోనియాతో చికిత్స పొందుతూ మృతి చెందారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. మూడు వేలకు పైగా పాటలు రాశారు.సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఫిలింఛాంబర్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరగనున్నాయి..ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ విధంగా స్పందించారు..
మంచి మిత్రుడిని కోల్పోయా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిరివెన్నెల చివరిసారిగా నాతోనే ఫోన్ లో మాట్లాడారని తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యంపై చర్చించాం అన్నారు. సాహిత్యపరంగా సిరివెన్నెల లాస్ట్ లెజెండ్ అన్నారు చిరంజీవి.
సిరివెన్నెల మరణం తీరని లోటని టిఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవేదనవ్యక్తం చేశారు.
తెలుగు జాతి గర్వపడేలా కలాన్ని కదలించారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు.సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాని మంత్రి కోరారు. సిరివెన్నెల కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
శాస్త్రిగారు లేని తెలుగు సినీ పాటలు ఎలా ఉంటాయో ఊహించుకోవడమే కష్టమన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..
సిరివెన్నెల ఇంత త్వరగా శివైక్యం చెందడం బాధాకరమన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా..సాహితీ హిమాలయం సీతారాముడని అన్నారు.
సిరివెన్నెల పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు.
సిరివెన్నెల లేని లోటు తీర్చలేనిదని నందమూరి బాలకృష్ణ అన్నారు..సిరివెన్నెల నుంచి నేనెంతో స్ఫూర్తిని పొందానని చెప్పారు.
సిరివెన్నెల లాంటి వారు మళ్లీ రారని రామజోగయ్య శాస్త్రి ఆవేదనవ్యక్తం చేశారు..
ప్రతీ పదంలో సముద్రమంత లోతు ఉందని రాజశేఖర్ అన్నారు.
సిరివెన్నెల మృతి యావత్ సినీ ప్రపంచానికి విషాదమని పరుచూరి తెలిపారు. సిరివెన్నెల లేరన్న వార్త విని గుండె జారిందన్నారు.
ఒక వటవృక్షం కూలిపోయిందని తనికెళ్ల భరణి అన్నారు.
మంచి స్నేహితుడిని కోల్పోయామని మణిశర్మ అన్నారు..
సిరివెన్నెల మరణం బాధాకరమని వెంకటేష్ వాపోయారు..
సరస్వతి పుత్రుడిని కోల్పోయామని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు..
తెలుసా మనసారా పాటను ఆయన పక్కన ఉండి రాయించుకున్నానని నాగార్జున తెలిపారు..
సిరివెన్నెలకు నివాళి అర్పించారు మంత్రి తలసాని..
తెలుగు భాష బతికి ఉన్నంతకాలం సిరివెన్నెల గుర్తుంటారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలిపారు..రాబోయే తరాలకి స్ఫూర్తి సిరివెన్నెల అన్నారు..
సిరివెన్నెలకు నివాళి అర్పించారు హీరో శ్రీకాంత్..
సిరివెన్నెల మరణం సినీ రంగానికి తీరని లోటని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు..
మంత్రి హరీశ్ రావు సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులర్పించారు..