తనని టీచర్ రోజు కొడుతున్నారని ఓ విద్యార్థి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశాడు. బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అనిల్ నాయక్ అనే విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలం నుంచి మ్యాథ్స్ టీచర్ ఆ విద్యార్థిని కొడుతున్నాడు. దీంతో టీచర్ దెబ్బలను భరించలేని బాధిత విద్యార్థి ఏకంగా పోలీసు స్టేషన్కు వెళ్లి.. ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. మ్యాథ్స్ టీచర్ తనను కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రమాదేవికి అనిల్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాధారణంగా చిన్నపిల్లలు పోలీసులను చూస్తేనే భయపడిపోతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు మారాం చేస్తే.. పోలీసులకు పట్టిస్తామని భయపెడతారు. ఇటీవలి కాలంలో పిల్లలు ధైర్యంగా పోలీస్స్టేషన్లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లపై ఫిర్యాదులు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
సార్ కొడ్తుండు – కేసు పెట్టండి మేడమ్ -ఎస్ ఐకి కంప్లైంట్ చేసిన స్టూడెంట్
Advertisement
తాజా వార్తలు
Advertisement