- ఉన్న దారిలో అన్నీ గుంతలే
- జర్నీ చేయాలంటే జనాల్లో భయం
- అధికారులకు అస్సలు కనిపించడం లేదా
- భగ్గుమంటున్న స్థానికులు
- తాత్కాలిక రిపేర్లు అయినా చేయాలని రిక్వెస్ట్
ఆంధ్రప్రభ, అచ్చంపేట: సాక్షాత్తు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లే రహదారి గుంతల మయం అయ్యింది. ఈ రోడ్డు అంతా అధ్వానంగా మారింది. అధికారుల పనితీరుకు ధర్పణం పడుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం, కాంసానిపల్లి రోడ్డు దుస్థితి ఇది. వంగూర్ నుంచి ఉప్పునుంతల వరకు వేసిన రెండు లైన్ల రోడ్డు వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉండగా.. కాంసానిపల్లి గ్రామంలోని అంతర్గత రోడ్డుమాత్రం గుంతలమయంగా మారింది. పూర్తిగా అధ్వానంగా తయారైంది.
నిత్యం ఈ రహదారిలో వందాలది వహనాలు తిరుగుతుంటాయి. గుంతలమయమైన ఈ రూట్‌లో వర్షపు నీరు చేరి వాహనదారులకు నరకప్రాయంగా మారుతోంది. ఈ దారిలో జర్నీ చేయాలంటే వాహనదారులు జంకుతున్నారు. ముఖ్యమంత్రి స్వగ్రామానికి వెళ్లే రహదారి ఇలాంటి దుస్థితిలో ఉండటమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దెబ్బతిన్న ఈ రోడ్డును తాత్కాలికంగా అయినా రిపేర్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.