సినిమాలో దాదాపుగా 30 వేలకు పైగా పాటలు పాడారు మనో. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ ,బెంగాలీ వంటి భాషలతో సహా 11 భాషలలో ఆయన పాటలు పాడడం గమనార్హం. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయనకు ఒక సెపరేట్ స్టైల్ ఉంది. ఈయన పుట్టి పెరిగింది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెన్నపల్లి . ఈయన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎంతో చక్కగా తెలుగు పాటలు పాడతారు. ఇక ఈయన తండ్రి ఆలిండియా రేడియోలో కూడా పనిచేసేవారు. మనో కు చిన్న వయసు నుంచే సంగీతం అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండడంతో నేదునూరు కృష్ణ మూర్తి దగ్గర ఈయన తండ్రి సంగీతం నేర్చుకోడానికి పంపించారు. అయితే ఈయనని మనో గా మార్చింది మాత్రం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజ.మనో బిజినెస్, రియల్ ఎస్టేట్ వైపు అడుగు పెట్టడంతో వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దాదాపుగా రూ.560 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇప్పుడు కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా, సింగర్ గా కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement