Tuesday, November 26, 2024

ఆ ఛాన్స్ నాకు వ‌స్తే బాగుండేది- సీఎం కేజ్రీవాల్

ఇండియాలో జ‌రుగుతోన్న ప‌నుల‌ను ప్ర‌పంచంతో పంచుకునే ఛాన్స్ త‌న‌కి వ‌స్తే బాగుండేద‌న్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సు పర్యటనపై గందరగోళం నెలకొనడంతో కేజ్రీవాల్ స్పందించారు. భారతదేశంలో నేను వెళ్లి నా అభిప్రాయాన్ని ముందుకు తెచ్చి, భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచంతో పంచుకోగలిగితే బాగుండేద‌ని.. దానికి నేను ఎవరినీ నిందించన‌ని చెప్పారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం సింగపూర్‌ను సందర్శించేందుకు అనుమతించనందుకు కేంద్రాన్ని నిందించిన ఒక రోజు తరువాత ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. తాజా ప‌రిణామం ఇండియాకు, ఢిల్లీకి అవమానాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు.

తాను ఈరోజు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశానికి హాజరవుతారని అన్నారు. కేజ్రీవాల్ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌నకు అనుమ‌తి కోరుతూ ఆప్ ప్రభుత్వం జూన్ 7వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫైల్ పంపించింది. అయితే అది జూలై 21వ తేదీన తిరిగి వ‌చ్చింది. దీనిపై ప్ర‌భుత్వం స్పందించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘‘ చాలా ఆల‌స్యం జ‌రిగింది. ప్రయాణ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి జూలై 20 చివరి తేదీ. అది కూడా కూడా ముగిసిందని పేర్కొంది. ఆరోగ్యం, విద్య, ఇతర రంగాలలో ఢిల్లీలో చేసిన ప్రపంచ స్థాయి పనుల గురించి అంతర్జాతీయ ఫోరమ్‌లో మాట్లాడకుండా సీఎంను ఆప‌డం కేంద్రం ఉద్దేశమని కూడా ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరి ఉండవచ్చు, కానీ ప్రపంచ సమాజంలో దేశం అవమానాన్ని ఎదుర్కొంది. ఈ విధానానికి కూడా కేంద్రమే బాధ్యత వహిస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement