తెలుగు సినిమా రంగానికి సరికొత్త నడకలు నేర్పిన నటుడు.. పేదల జీవనమే కథాంశంగా ఉంటుంది. దర్శకుడిగా, నిర్మాతగా.. గీత రచయితగా తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయనే ఆర్ నారాయణమూర్తి.. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట నుంచి వచ్చిన మూర్తన్నా.. తెలంగాణ జీవన విధానం.. ఇక్కడి ప్రజల బాధలు, కన్నీలు.. గ్రామీణులు ఎదుర్కొనే ఇబ్బందులు.. రైతుల స్థితిగతులు.. నక్సలిజం గురించి ఎన్నో సినిమాలు తీశారు.. స్వయంగా నటించారు. తెలుగు సినిమారంగంలో ఎర్రసైన్యం సినిమా ఒక ట్రెండ్‌ను సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి, విడుదల చేశారు.
కమర్షియల్ పరంగా ఎన్నో ఆఫర్లు వచ్చినా మూర్తన్న అటువైపు దృష్టిపెట్టలేదు. ఆయన ఇప్పటికీ సాధారణ జీవనాన్నే ఇష్టపడుతారు. హైదరాబాద్ సిటీలో ఉన్నా.. ఆటోలో జర్నీ చేస్తారు. సిటీ బస్సుల్లోనూ ప్రయాణిస్తారు.. ఇప్పటికీ లగ్జరీ లైఫ్ అంటే ఆయన ఏవగించుకుంటారనే చెప్పవచ్చు..
కమ్యూనిస్టు భావజాలం ఉన్న నారాయణమూర్తి ఈరోజు (సోమవారం) పరకాల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటే.. ముచ్చటపడ్డ కండక్టర్ సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని ఎంతో ప్రేమతో ట్విట్టర్‌లో పోస్టు చేసి.. ఎర్రబస్సులో ఎర్ర జెండా క్యాప్షన్‌తో పోస్టు చేశారు.
ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూర్తన్న సింప్లీసిటీని నెటిజనం లైక్ చేస్తూ.. ఫొటోను షేరింగ్ చేస్తున్నారు.