సిమ్లాకు పర్యాటకులు ఎక్కువగా వెళ్లుతుంటారనే సంగతి తెలిసిందే. కాగా తాజాగా సిమ్లాలో భారీ మంచు కురిసింది. దాంతో సిమ్లా ప్రాంతం అంతా శ్వేతవర్ణంలోకి మారిపోయి ..ఆకర్షణీయంగా తయారయింది. కాగా ఈ మంచుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిమ్లాలో భారీ మంచు కురవడం వల్ల అక్కడి ప్రజలు చలితో వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మంచు గడ్డలు పేరుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉండడంతో వాతావరణశాఖ అధికారులు.. ప్రజలను అప్రమత్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..