Tuesday, November 26, 2024

సిలికాన్ వ్యాలీ దిగ్గ‌జం.. గోర్డ‌న్ మూర్ క‌న్నుమూత‌

కంప్యూట‌ర్ ప్రాసెస‌ర్ ఇండ‌స్ట్రీలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌చ్చారు సిలికాన్ వ్యాలీ దిగ్గ‌జం, ప్ర‌ముఖ‌ దాత గోర్డ‌న్ మూర్. కాగా ఆయ‌న క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 94 ఏళ్లు. హ‌వాయిలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. 1950 ద‌శ‌కంలో ఆయ‌న సెమీకండ‌క్ట‌ర్ల వ్యాపారం మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇంటెల్ కార్పొరేష‌న్ సంస్థ‌ను స్థాపించారు. ప్ర‌తి ఏడాది కంప్యూట‌ర్ ప్రాసెసింగ్ ప‌వ‌ర్స్ రెట్టింపు అవుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. సెమీకండ‌క్ట‌ర్స్ వ్యాపారం కోసం ఆయ‌న ఆ రోజుల్లో కొత్త రూల్స్ రూపొందించారు. పీసీ రెవ‌ల్యూష‌న్‌లో ఆయ‌న పాత్ర ప్ర‌త్యేక‌మైంది. మెమోరీ చిప్స్ త‌యారీలోనూ మూర్ త‌న‌దైన ముద్ర వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement