పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం సద్దుమణిగింది. పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలపడంతో సమస్య కొలిక్కి వచ్చింది.
సీఎం మార్పు తర్వాత పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేయడంతో పంజాబ్లో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా తాను పీసీసీ చీఫ్ గా కొనసాగాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు సిద్ధూ. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఛన్నిని కలిసి ముఖాముఖి చర్చలు జరిపారు.
పంజాబ్ డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాను తొలగించాలన్న సిధ్దూ డిమాండ్ కు సీఎం చరణజిత్ సింగ్ ఛన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొన్నిసార్లు భావావేశానికి లోనౌతారనే విషయం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలిసిందేనని, హైకమాండ్ అంతా అర్థం చేసుకుంటుందని సిధ్దూ సలహాదారు మహమ్మద్ ముస్తాఫా తెలిపారు.