Friday, November 22, 2024

పోలీస్ శాఖను వెంటాడుతున్న కరోనా

తెలంగాణలో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పోలీసులు సైతం కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసు శాఖలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజా పోలీసు శాఖలో మరో కరోనా మరణం నమోదైంది. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టించింది. ఇటీవల కరోనా సోకిన ఎస్‌ఐ గణపతి(53) చికిత్స పొందుతూ మరణించారు. ఐదు రోజుల క్రితం గణపతికి జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ని కుటుంసభ్యులు హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన గణపతి పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఆర్నెల్ల క్రితం సిద్దిపేట నుంచి బదిలీపై కామారెడ్డికి వచ్చిన ఆయన ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు. గణపతి గతంలో కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐగా కూడా విధులు నిర్వహించారు.

కాగా, తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన సంఖ్య మనకు తెలిసిందే. అయితే కరోనా పోరుపై ముందు వరుసలో ఉన్న పోలీస్ శాఖలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు అనేకమంది పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement