పూరీ జగన్నాథుడి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ఓపెన్ చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం కొవిడ్ ప్రోటోకాల్‌ని అనుసరిస్తూ తిరిగి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. పునఃప్రారంభమైన మొదటి రోజు ఊహించిన దాని కంటే జనాలు తక్కువగానే వచ్చారు. కాగా, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో జనవరి 10 వ తేదీన ఈ ఆలయాన్ని మూసివేశారు. అయితే జగన్నాథ దేవాలయం అడ్మినిస్ట్రేషన్ (SJTA) భక్తులకు సాఫీగా దర్శనం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.
ప్రస్తుతం అన్ని రోజులలో రాత్రి 9 గంటల ప్రజల దర్శనం కోసం అవకాశం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి వారి RT-PCR రిపోర్టుని తప్పకుండా వెంట తెచ్చుకోవాని అది కూడా జారీ చేసిన తేదీ నుండి 96 గంటల వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని కండిషన్స్ పెట్టారు. అంతేకాకుండా రెండు డోసుల టీకాలు తీసుకున్నట్టు సర్టిఫికెట్ కూడా వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దంటున్నారు. ఈ పరిమితి ఫిబ్రవరి 17 వరకు అమల్లో ఉంటుందని, అలాగే.. శానిటైజేషన్ కోసం ఆదివారాలు భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ఉండదని తెలిపారు