ఎవరి ట్యూబులు వారివే.. కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు యూట్యూబ్ చానల్ పెట్టడం, అందులో ఇష్టమున్న కంటెంట్ పోస్టు చేయడం ఇప్పుడు కామన్ అయ్యింది. ఈ మధ్య సింగర్ శ్రావణ భార్గవి తన యూట్యూబ్ చానల్లో పెట్టిన ఓ వీడియో చాలా వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో శ్రావణ భార్గవి తను చేసింది కరెక్టేనని, ఎవరినీ కించపరిచేలా ‘ఒకపరి.. ఒకపరి’ కీర్తన పెట్టలేదని వాదించింది. దీనిపై కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్స్, ట్రోల్సింగ్స్తో శ్రావణని ఆడుకున్నారు.
కాగా, ఈ వీడియోపై అన్నమాచార్య వారసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పునరాలోచన చేసిన సింగర్ శ్రావణ భార్గవి ఆ వీడియోని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోని తీసేసింది. త్వరలోనే మరో పాటతో మీ ముందకు వస్తానని తన అభిమానులకు తెలిపింది. ఇంతటితో ఇన్ని రోజులుగా సాగిన వివాదం కాస్త సద్దుమణిగినట్టయ్యింది.