హైదరాబాద్‌లోని నాంపల్లిలో దారుణం జరిగింది. ఓ షాపులో కూల్ డ్రింక్ బాటిల్ దొంగిలిస్తూ బాలుడు ఆ షాపు ఓనర్‌కి దొరికిపోయాడు. దీంతో ఆ బాలుడి బట్టలు విప్పి చితకబాదాడు. అక్కడితో ఆగకుండా ఆ షాపు యజమాని బాలుడి ప్రైవేట్ భాగాలపై కారం పొడి చల్లాడు.
అంతేకాకుండా ఆ నొప్పి భరించలేక ఏడుస్తూ.. కారంపొడిని కడుక్కునేందుకు నీళ్లు అడుగుతున్న ఆ బాలుడిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. తల్లిదండ్రులు ఈ వీడియో చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దుకాణం యజమానిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు.