టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 12కు చేరింది. మహిళల షూటింగ్ ఆర్8షూటర్ అవని లెఖారా మరోసారి చరిత్ర సృష్టించింది. 50మీ. రైఫిల్ 3పీ విభాగంలో.. అవని లేఖరా కాంస్యం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారణిగా రికార్డుకెక్కింది.
కాగా అవని కి ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులు అభినందనలు తెలిపారు.