Saturday, November 23, 2024

షాకింగ్:క‌రోనా బారిన ప‌డిన ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రికి దీర్ఘ‌కాలిక కోవిడ్..

కరోనా ప్రపంచంతో ఓ ఆట ఆడుకుంటోంది..ఇప్పటికే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తో అతలాకుతలం చేసింది ఈ మహమ్మారి…అయితే కరోనా నుంచి కోలుకున్న వారికి ఓ షాకింగ్ న్యూస్ చెబుతోంది తాజా పరిశోధన.. క‌రోనా బారిన ప‌డిన ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు దీర్ఘ‌కాలిక కోవిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నంలో తేలింది. క‌రోనా బారిన ప‌డిన రోగుల‌పై బ్రిట‌న్ కు చెందిన యూనివ‌ర్శిటి కాలేజ్ ఆఫ్ లండ‌న్ ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేశారు. బ్రెయిన్ ఫాగ్ నుంచి చెవిలో మోత వ‌ర‌కు అనేక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నంలో తేలింది.  దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వ్య‌క్తుల్లో సుమారు 200 ర‌కాల స‌మ‌స్య‌ల‌ను గుర్తించిన‌ట్టు యూనివ‌ర్శిటి ఆఫ్ లండ‌న్ ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఈ స‌మ‌స్య‌ల కార‌ణంగా శ‌రీరంలోని 10 ముఖ్య‌మైన అవ‌య‌వాలు ప్ర‌భావితం అయ్యాయ‌ని పరిశోధ‌న‌ల‌తో తేలింది.  దీర్ఘ‌కాలిక కోవిడ్ స‌మ‌స్య‌లు దాదాపుగా 6 నెల‌ల‌పాటు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  జ్ఞ‌ప‌క‌శ‌క్తి స‌మ‌స్య‌లు, నీర‌సం, దుర‌ద‌, మాన‌సిక అశాంతి, లైంగిక బ‌ల‌హీన‌త‌, నెల‌స‌రిలో హెచ్చుత‌గ్గులు, ఆయాసం, గుండెద‌డ వంటి స‌మ‌స్య‌లు అధికంగా ఉంటాయ‌ని ప‌రిశోధ‌నలో తెలింది.  కోవిడ్ దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యుల‌ను సంప్రదిస్తూ చికిత్స తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: బాలికను రక్షించడానికి వెళ్లి బావిలో పడ్డ 40 మంది.. 

Advertisement

తాజా వార్తలు

Advertisement