రాజకీయాలు అన్నాక ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారడం పరిపాటే. కాగా సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్ ఇవ్వనున్నారు శివసేన కీలక నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే.కాగా ఏక్‌నాథ్ షిండే 11 మంది పార్టీ ఎమ్మెల్యేలతో గుజరాత్ సూరత్‌లోని ఓ హోటల్‌కు వెళ్లినట్టుగా సమాచారం. వీరంతా శివసేనపై తిరుగుబావుట ఎగరవేసేందుకు సిద్దమైయ్యారట. ఏక్‌నాథ్ షిండేతో పాటు సూరత్ వెళ్లిన ఎమ్మెల్యేలు.. బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక, తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
మరోవైపు ప్రస్తుతం శివసేన వర్గాలకు ఏక్‌నాథ్ షిండే అందుబాటులో లేరని సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రమాద ఘంటికలు మోగించే సూచనలు కనిపిస్తాయి. ఇ షిండే ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సూరత్‌లో ఏక్‌నాథ్ షిండేతో పాటు పలువురు శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ పరిసరాల్లో గుజరాత్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. రిసార్ట్‌లోకి ఎవరిని అనుమతించడం లేదు.