Friday, November 22, 2024

విప‌క్ష కూట‌మికి షాక్ – రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ చేయ‌బోన‌ని తెలిపిన గోపాల‌కృష్ణ గాంధీ

విప‌క్ష కూట‌మి త‌ర‌పున గోపాల‌కృష్ణ‌గాంధీని రాష్ట్ర‌ప‌తి బ‌రిలోకి దింపాల‌ని భావించాయి. అయితే రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని గాంధీ మ‌న‌వ‌డు గోపాలకృష్ణ గాంధీ ప్రకటించడం విపక్ష పార్టీలను షాక్ కు గురి చేసింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని విపక్షాల కూటమి తరపున తనను ప్రతిపాదించాలని భావించడం పట్ల ఆయన ముందుగా విపక్ష పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేయబోనన్నారు. ఈ మేరకు గోపాలకృష్ణ గాంధీ ఓ ప్రకటనను విడుదల చేశారు.
గోపాలకృష్ణ గాంధీ గతంలో వెస్ట్ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా గా పనిచేశారు. జాతిపిత మహాత్మాగాంధీ మనుమడే గోపాలకృష్ణ గాంధీ. తన కంటే ఈ పదవిని నిర్వహించే సమర్ధులు అనేక మంది ఉన్నారని ఆయన ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. విపక్షాలు తొలుత శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపాలని భావించాయి.

అయితే క్రీయాశీలక రాజకీయాల్లో తాను ఇంకా కొనసాగాలని భావిస్తున్నట్టుగా శ‌ర‌ద్ ప‌వార్ ప్రకటించారు. మరో వైపు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేరుపై విపక్షాలు ఆలోచించాయి. అయితే ఫ‌రూఖ్ అబ్దుల్లా కూడా క‌శ్మీర్ సమస్య సద్దుమణిగే వరకు తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. దీంతో గోపాలకృష్ణ గాంధీ వైపు విపక్షాలు చూశాయి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని విపక్షాలు గోపాలకృష్ణ గాంధీకి తెలిపారు. అయితే రాష్ట్రపతి పదవికి తాను పోటీ చేయబోనని గోపాలకృష్ణ గాంధీ ప్రకటించారు. విపక్షాల కూటమి తరపున అభ్యర్ధి ఎవరనే విషయమై స్పష్టత రాలేదు. తమ కూటమి నుండి రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దింపుతారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21న విపక్ష కూటమి మరో సారి సమావేశమై రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధిని నిర్ణయించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement