కాంగ్రెస్ సీనియర్ నేత ..పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. గుడ్ లక్..గుడ్ బాయ్ కాంగ్రెస్ అని తెలిపారు. దాంతో చింతన్ శిబిర్ పేర.. పార్టీని రిపేర్ చేస్తున్న సమయంలోనే పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఝలక్ తగిలింది. ఈ సందర్భంగా హైకమాండ్‌పై సునీల్ జాఖడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత… హైకమాండ్ ఒక్కరి మాటే వింటోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమ కుటుంబంలోని మూడు తరాల వారు కాంగ్రెస్‌కు సేవలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే.. తాను పార్టీ విధి విధానాల ప్రకారం నడుచుకోలేదని, అన్ని పదవులను తన నుంచి లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌పై మనసు విరిగిపోయిందని సునీల్ జాఖడ్ వివరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పంజాబ్ సీనియర్ నేత సునీల్ జాఖడ్‌కు పార్టీ ఝలక్ ఇచ్చింది. ఆయనను అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈయనతో పాటు కేరళ సీనియర్ నేత కేవీ థామస్‌పై కూడా ఇదే రకమైన చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీ సిఫార్సు మేరకు సోనియా గాంధీ వాటికి ఆమోద ముద్ర వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement