హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకత్వానికి రాజీనామ చేశారు ఆనంద్ శర్మ. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 26న ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రాజీనామా అనంతరం ఆనంద్ శర్మ మాట్లాడుతూ… ఎన్నిక సభలకు సంబంధించిన కీలక సమాచారం కూడా తనకు అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. తన ఆత్మగౌరవంతో రాజీ పడలేనని లేఖలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు స్టీరింగ్ కమిటీ విధులపై పూర్తి స్పష్టతను ఇవ్వాలని ఆయన ఏఐసీసీ ఇన్ఛార్జిని కోరారు. ఆనంద్ శర్మ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కోర్ గ్రూపులోని సీనియర్ నేతలు ఢిల్లీ, సిమ్లాలలో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఆనంద్ శర్మను భాగస్వామిని చేయలేదు. అయినప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ఆనంద్ శర్మ ప్రకటించారు. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు హిమాచల్ లో పర్యటించి కాంగ్రెస్ మద్దతుదారులను సమీకరించనున్నారు.
కాంగ్రెస్ కి షాక్ – పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకత్వానికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మ
Advertisement
తాజా వార్తలు
Advertisement