నాంపల్లి కోర్టు బిజెపి నాయకుడు, ఎంపీ ధర్మపురి అరవింద్ కి షాక్ ఇచ్చింది. ఈమేరకు ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ని ఇష్యూ చేసింది. గతంలో అంటే 2020 నవంబర్ 23 వ తేదీన కెబిఆర్ పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కోడింగ్ లను ఎంపీ అరవింద్ .. ఆయన అనుచరులు చింపి వేశారు అంటూ కేసు నమోదు అయింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ లను దుర్భాషలాడారని అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ కూడా వేశారు. ఈ కేసును నేడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ చేసింది. అయితే ఇవాళ తప్పనిసరిగా కేసు విచారణకు హాజరు కావాల్సినప్పటికీ..ధర్మపురి అరవింద్ హాజరు కాలేక పోయారు. దీంతో ఆగ్రహం గురైన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు… ధర్మపురి అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ఈ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కి షాక్ – ‘నాన్ బెయిలబుల్ వారెంట్’ జారీ చేసిన నాంపల్లి కోర్టు
Advertisement
తాజా వార్తలు
Advertisement