ఏసీబీకి షాక్ ఇచ్చాడు ఓ ఐటీ అధికారి. రూ. 30 లక్షల లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ.. ఓ ఐటీ అధికారిని అరెస్టు చేయడానికి వచ్చింది. అప్పుడు ఆ అధికారిని అక్కడే ఉన్న ఇంకో అధికారి కాపాడాడు. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి ఫోన్‌లు నదిలో విసిరేశాడు. దీంతో కీలకమైన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. ఈ కేసు ఇప్పుడు సీబీఐ టేకప్ చేసింది. ఫోన్‌లు విసిరేసిన అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. సీబీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఐఆర్ఎస్ అధికారి సంతోష్ కర్ణని గతేడాది అక్టోబర్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్‌గా పని చేశారు. అతనితోనే ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనరర్ వివేక్ జోహ్రీ కూడా ఉన్నారు. సంతోష్ కర్ణని పై బిల్డర్ రూపేశ్ బ్రహ్మభట్ గుజరాత్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
తనపై యాక్షన్ తీసుకోరాదంటే రూ. 30 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సంతోష్ కర్ణని పట్టుకోవడానికి ప్రొసీడింగ్స్ ప్రకారం ట్రాప్ వేసింది.ఆ రూ. 30 లక్షలను ఏసీబీ రికవరీ చేసుకుని.. ఆశ్రమ్ రోడ్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసుకు బయల్దేరింది. సంతోష్ కర్ణని అరెస్టు చేయడానికి అక్కడికి వచ్చింది. అదే సమయంలో సంతోష్ కర్ణ తప్పించుకోవడానికి వివేక్ జోహ్రి సహకరించాడు. ఆఫీసు వద్ద ఆందోళన చేశాడు. తద్వార స్పాట్ నుంచి కర్ణని తప్పించుకుపోవడానికి దోహదపడ్డాడు.కర్ణని అక్కడి నుంచి పారిపోవడానికి ముందు తన రెండు ఫోన్‌లను వివేక్ జోహ్రికి ఇచ్చాడు. ఆ రెండు ఫోన్‌లను జోహ్రి.. ఏసీబీకి చిక్కకుండా సమీపంలోని సబర్మతి నదిలో విసిరేశాడు.
ఆ తర్వాత ఈ కేసు విచారణను గుజరాత్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఆ రెండు ఫోన్లను నదిలో నుంచి రికవరీ చేసుకున్నారు. డైవర్లు, ఇతర ఏజెన్సీల సహాయంతో వాటిని పట్టుకున్నారు.