Friday, November 22, 2024

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ కి షాక్ – లండ‌న్ వెళ్ల‌కుండా అడ్డుకున్న ఈడీ అధికారులు

లండ‌న్ కి వెళ్ల‌కుండా విమానాశ్ర‌యంలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాణా అయ్యూబ్ ని అడ్డుకున్నారు. మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌ను లండన్ వెళ్ల‌డానికి..ముంబై విమానాశ్రయంకి చేరుకున్నారు. అయితే.. ఇమ్మిగ్రేషన్ వ‌ద్ద ఆమెను ప‌లు కార‌ణాలు చెప్పి.. లండన్‌కు విమానం ఎక్కే ముందు ముంబై విమానాశ్రయంలో నిలిపివేశారు ఈడీ అధికారులు. ఈడీ జారీ చేసిన లుక్-అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) ఆధారంగా జర్నలిస్ట్ రాణా అయ్యూబ్ లండన్‌కు విమానం ఎక్కేందుకు వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. అనంత‌రం ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. భారత ప్రజాస్వామ్యంపై కీలక ప్రసంగం చేయడానికి అంతర్జాతీయ జర్నలిజం ఫెస్టివల్‌కు వెళ్తున్నాను.

ఈ ఫెస్ట్ లో కీలకోపన్యాసం చేయడానికి నేను వెంటనే ఇటలీకి వెళ్లాల్సి ఉంది. ఆ ఫెస్ట్ లో నా ప్ర‌సంగం ఉండ‌కుండద‌నీ, లండన్‌ ఫ్లైట్ ఎక్కబోతున్నప్పుడు ఇండియన్ ఇమ్మిగ్రేషన్ వద్ద నన్ను ఆపారు. త‌న‌కు నోటీసులు మెయిల్‌కి వచ్చింది. నీకేం భయం?” అని ట్విట్ చేసింది. వాషింగ్టన్‌కు చెందిన నాన్-ప్రాఫిట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్స్, మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ దాడుల‌పై చర్చ కోసం Ms అయ్యూబ్‌ను యూకే ( లండ‌న్) నుంచి ఆహ్వానించింది. ఇందులో అయ్యూబ్.. జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న‌ ట్రోల్స్, ఆన్‌లైన్ వేధింపులు బెదిరింపులపై ప్ర‌సంగించాల్సి ఉంది. కాగా కరోనా క‌ష్ట‌కాలంలో విరాళాలు సేకరిస్తున్నప్పుడు విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ మేర‌కు ఆమెను ఏప్రిల్ 1న విచారణకు పిలిచింది. రానా.. 2020- 2021 మధ్య కాలంలో Ketto అనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ. 2.69 కోట్లకు పైగా విరాళాలు సేకరించినట్లు, విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించార‌ని ఆర్థిక నేరాలను పరిశోధించే ఏజెన్సీ కనుగొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement