దేశమంతటా తన హవాని చాటేందుకు యత్నిస్తోంది బిజెపి పార్టీ. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాలు జోరందుకుంటున్నాయి. పలు రాష్ట్రాలకి ప్రధాని మోడీ వరాల జల్లు కురిపిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్ వాది పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీలోని నలుగురు కీలక నేతలు బిజెపి కండువాని కప్పుకోవడం విశేసం. సమాజ్‌వాది పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రవి శంకర్ సింగ్ పప్పు, సీపీ చంద్, అక్షయ్ ప్రతాప్ సింగ్, రాం నిరంజన్‌లు యూపీ డిప్యూటీ సీఎంలు దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు స్వతంత్రా దేవ్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన వీరు నలుగురూ గతంలో స్థానిక సంస్థల కోటాలో సమాజ్‌వాది పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైయ్యారు. వచ్చే ఏడాది మార్చి నెలతో వీరి పదవీకాలం ముగియనుంది. వీరు నలుగురికీ తమతమ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ప్రజాబలం ఉంది. వీరు సమాజ్‌వాది పార్టీని వీడి బీజేపీ గూటికి చేరడంతో.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily