Tuesday, November 26, 2024

షిండేకు షాక్.. పార్టీ వివాదాలకు అసెంబ్లీ వేదిక కాదు.. సుప్రీం

మహారాష్ట్రలో శివసేన పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై ఈరోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. ఉద్ధవ్ ఠాక్రే ఫ్లోర్ టెస్ట్‌ను ఎదుర్కోలేక తన రాజీనామాను సమర్పించినందున.. యథాతథ స్థితిని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అతిపెద్ద పార్టీ బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండేతో గవర్నర్ ప్రమాణం చేయించడం సమర్థనీయమని తెలిపింది.

అయితే అదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. శివసేన పార్టీ విప్‌గా గోగావాలే (షిండే గ్రూపు)ని నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఏక్ నాథ్ షిండే క్యాంపు ఎమ్మెల్యే గోగావాలేను శివసేన విప్‌గా గుర్తించలేదని తెలిపింది. రాజకీయ పార్టీ నియమించిన విప్‌కు మాత్రమే గుర్తింపు ఇవ్వాలని పేర్కొంది. ఇక, అసెంబ్లీలో బలపరీక్షకు అవసరమైన అంశం గవర్నర్ వద్ద లేదని తేల్చేసింది. అంతర్గత పార్టీ వివాదాన్ని పరిష్కారానికి అసెంబ్లీ వేదిక కాదని స్పష్టంగా చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement