Friday, November 22, 2024

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి షాక్ – లైసెన్స్ ర‌ద్దు చేసిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి షాక్ ఇచ్చింది. బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్స్ ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. ఈ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తోందని తెలిపింది. ల్యాబ్ పరీక్షల సమయంలో కూడా పీహెచ్ విలువ స్టాండర్డ్ గా లేదంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా లైసెన్స్ ను రద్దు చేసినట్టు తెలిపింది. కోల్ కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పూణె, నాసిక్ ల నుంచి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement